Morbi bridge చరిత్ర
|
మోర్బీ రాజు సర్ వాఘ్‌జీ ఠాకుర్ |
⭐గుజరాత్‌లోని మోర్బీ వద్ద మచ్చు నది మీద ఉన్న తీగల వంతెన ఇటీవల తెగి
పడిపోయింది.
⭐ఈ ప్రమాదంలో దాదాపు 140 మంది చనిపోయారు.
⭐ఇంకా చాలా మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
మోర్బీ రాజుల ప్రతీక
⭐సుమారు 150 ఏళ్ల నాటి ఈ వంతెన మోర్బీ రాజుల పాలనకు సంబంధించి ఒక ప్రతీకగా
ఉంటూ వస్తోంది అని చెప్పవచ్చు .
⭐మోర్బీ రాజు సర్ వాఘ్‌జీ ఠాకుర్ ఈ వంతెనను నిర్మించారు.
⭐నాడు దీని నిర్మాణంలో యూరోపియన్ టెక్నాలజీ వాడారు అని తెలుస్తుంది.
1879లో ప్రారంభం
⭐ఈ వంతెనను 1879 ఫిబ్రవరి 20న నాటి బాంబే గవర్నర్ రిచర్డ్ టెంపుల్
అప్పటిలో ప్రారంభించారు.
⭐వంతెన నిర్మాణంలో వాడిన మెటీరియల్ అంతా ఇంగ్లండ్ నుంచి తెప్పించారు.
⭐నాడు వంతెన నిర్మాణానికి రూ.3.5 లక్షలు ఖర్చు అయింది.
⭐మోర్బీ పట్టణం ప్రారంభంలో ఈ తీగల వంతెన ఉంటుంది.
⭐అప్పటిలో దీన్ని ఒక సాంకేతికత అద్భుతంగా నాడు పిలుచుకునే వారు.
⭐1.25 మీటర్ల వెడల్పు 233 మీటర్ల పొడవు ఉండే ఈ వంతెన దరబార్‌గఢ్ ప్యాలెస్ నుంచి
రాజనివాసం నజర్‌బాగ్ వరకు ఉంటుంది.
నిర్మాణ శైలి
⭐బ్రిటిష్ పాలన కాలంలో యూరోపియన్ నిర్మాణ శైలిని చూసి మోర్బీ రాజు వాఘ్‌జీ
ముగ్ధుడయ్యాడు.
⭐మోర్బీ పట్టణం చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.
⭐పట్టణంలో యూరోపియన్ శైలి కట్టడాలు చాలానే కనిపిస్తాయి.
⭐మోర్బీని వాఘ్‌జీ ఠాకుర్ 1922 వరకు పాలించారు.
⭐పట్టణంలోని ప్రధానమైన 'గ్రీన్ చౌక్'కు వెళ్లాలంటే మూడు ద్వారాలను ఏర్పాటు
చేశారు. రాజ్‌పుత్, ఇటలీ నిర్మాణ శైలుల కలయిక ఆ ద్వారాల్లో కనిపిస్తుంది.
⭐మోర్బీ రాజుల 'ప్రగతిశీల, శాస్త్రీయ ద్పకృథానికి' ఈ వంతెన నిదర్శనమని
అక్కడి ప్రజలు చెబుతారు.
ఇప్పుడు నిర్వహణ ఎవరిది ?
⭐ప్రస్తుతం తీగల వంతెన నిర్వహణ మోర్బీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు
'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' రిపోర్ట్ చేసింది.
⭐ఇటీవల మోర్బీ మున్సిపాలిటీ వంతెన నిర్వహణను ఒరేవా గ్రూప్‌కు అప్పగించింది.
⭐15 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది.
0 Comments