🦁జనరల్ నాలెజ్డ్ (జీకే), కరెంట్ అఫైర్స్.. దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో కీలకమైన విభాగాలు.యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఐబీపీఎస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోలీస్ నియామక పరీక్షలు, డీఎస్సీ ఇలా ఒకటేమిటి అన్ని నియామక పరీక్షల్లో జీకే, కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. కరెంట్ అఫైర్స్‌కు, జీకేకు ఎలాంటి సిలబస్ ఉండదు. ప్రశ్నలు ఏ విభాగం, ఏ మూల నుంచైనా రావచ్చు. వీటిల్లో అత్యధిక మార్కులు సాధించాలంటే
ఒకరోజులో లేదా ఒక నెలలో జరిగే పనికాదు ప్రతి రోజు అప్డేట్ అవుతూనే
ఉండాలి కనుక ఈ విభాగాల్లో మీకోసం ప్రశ్నలు అండ్ సమాధానాలు ఈ రోజుకి ...✊
Today 2022 GK
Q.స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఓటరు 106 ఏళ్ల వయసులో కన్నుమూశారు అయన పేరు ఏమిటి ?
శ్యామ్ శరణ్ నేగి తన ఓటు హక్కును 34 సార్లు వినియోగించుకున్నారు. చివరిగా నవంబర్ 2వ తేదీన హిమాచల్ ప్రదేశ్ 14వ శాసనసభ ఎన్నికల్లో తన నివాసం నుంచి పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు వేశారు.
Q. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఎప్పుడు జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు మొదలుకుని ఇప్పటి శ్యామ్ శరణ్ ఓటు హక్కు వియోగించు కొంటున్నారు ?
1951- 52లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు మొదలుకుని ఇప్పటి వరకు తాను ఒక్కసారి కూడా ఓటు వేయకుండా ఉండలేదని శ్యామ్ శరణ్ తెలిపారు.
Q.ప్రముఖ గాంధేయవాది, ప్రముఖ మహిళా సాధికారత కార్యకర్త మరియు స్వయం ఉపాధి ఉమెన్స్ అసోసియేషన్ ( SEWA ) ప్రసిద్ధ వ్యవస్థాపకురాలు ఇటీవల మరణించారు వారి పేరు ఏమి ?
ఎలాబెన్ భట్ ఈమె 89 సంవత్సరాల వయస్సులో మరణించారు.
Q.గగనతలంలో ఉన్న అణు క్షిపణులు, యుద్ధ విమానాలను ధ్వంసం చేయగల ఇంటర్‌సెప్టర్ క్షిపణిని భారత్ పరీక్షించింది దీని ని ఎవరు తాయారు చేశారు ?
ఈ రక్షణాత్మక బాలిస్టిక్ క్షిపణిని డీఆర్‌డీఓ తయారుచేసింది..
Q.గగనతలంలో ఉన్న అణు క్షిపణులు, యుద్ధ విమానాలను ధ్వంసం చేయగల ఇంటర్‌సెప్టర్ క్షిపణిని భారత్ పరీక్షించింది దీని పేరు ఏమిటి ?
ఈ రక్షణాత్మక బాలిస్టిక్ క్షిపణిని డీఆర్‌డీఓ తయారుచేసింది.ఈ క్షిపణికి 'ఏడీ-1' అని పేరు పెట్టారు.
Q.వరల్డ్ నెట్‌వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ (WNBR) ఎప్పుడు ఏర్పడింది ? 1971లో ఏర్పడింది
1971లో ఏర్పడింది, ఇది జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ మరియు ప్రకృతికి అనుగుణంగా జీవించడానికి వెన్నెముకగా ఉంటుంది.
Q.కార్డీ గోల్డ్ నానోపార్టికల్స్ (Cor-AuNPs), నాలుగు భారతీయ సంస్థల శాస్త్రవేత్తల సహకార ప్రయోగం ఫలితంగా ఏ దేశం నుండి అంతర్జాతీయ పేటెంట్‌ను పొందింది ?
జర్మనీ నుండి. కార్డిసెప్స్ మిలిటారిస్ అనేది కార్డిసిపిటేసి కుటుంబంలోని ఫంగస్ జాతి, మరియు కార్డిసెప్స్ జాతికి చెందిన రకం. కార్డిసెప్స్ పుట్టగొడుగు తూర్పు హిమాలయ బెల్ట్‌లో కనిపిస్తుంది. ఇది యాంటీమైక్రోబయల్, యాంటీ డయాబెటిక్ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది.
Q.LED లతో ప్రకాశించే దీపాలను భర్తీ చేయడం ద్వారా ఎంత శక్తి వినియోగాన్ని దాదాపు ఎంత శాతం తగ్గించగలదు ?
దాదాపు 80 శాతం.
Q. రాజ్యాంగంలోని ఆర్టికల్ 155 మరియు 156 ప్రకారం, గవర్నర్ ఎవరి చేత నియమింపబడతారు ?
రాష్ట్రపతిచే నియమింపబడతారు
Q.'బేసి-సరి' వాహన కాలుష్యాన్ని నియంత్రించడానికి మరియు పెరుగుతున్న పర్టిక్యులేట్ మ్యాటర్ స్థాయిలను తగ్గించడానికి AAP ప్రభుత్వం ఏ సంవత్సరం లో మొదటిసారిగా ప్రవేశపెట్టింది ?
2016లో మొదటిసారిగా ప్రవేశపెట్టింది
Q.ప్రపంచవ్యాప్తంగా పాముకాటు మరణాలలో అత్యధిక భాగం - 78,600 మరణాలలో ఎంతవరకు భారతదేశంలోనే సంభవిస్తుందని నేచర్ కమ్యూనికేషన్స్ అంచనా వేసింది ?
64,100 వరకు
Q.ఎప్పుడు WHO దాని నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల (NTDలు) ప్రాధాన్యత జాబితాలో పాముకాటు విషాన్ని జోడించింది ?
జూన్ 2017లో లో చేర్చింది
0 Comments