🦁జనరల్ నాలెజ్డ్ (జీకే), కరెంట్ అఫైర్స్.. దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో కీలకమైన విభాగాలు.యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఐబీపీఎస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోలీస్ నియామక పరీక్షలు, డీఎస్సీ ఇలా ఒకటేమిటి అన్ని నియామక పరీక్షల్లో జీకే, కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. కరెంట్ అఫైర్స్‌కు, జీకేకు ఎలాంటి సిలబస్ ఉండదు. ప్రశ్నలు ఏ విభాగం, ఏ మూల నుంచైనా రావచ్చు. వీటిల్లో అత్యధిక మార్కులు సాధించాలంటే
ఒకరోజులో లేదా ఒక నెలలో జరిగే పనికాదు ప్రతి రోజు అప్డేట్ అవుతూనే
ఉండాలి కనుక ఈ విభాగాల్లో మీకోసం ప్రశ్నలు అండ్ సమాధానాలు ఈ రోజుకి ...✊
Q.2021 సెప్టెంబర్ 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం దేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి.?
8 జాతీయ పార్టీలు
Q.ఎడవళత్ కక్కత్ జానకి అమ్మాళ్ 125వ జయంతి ఇటీవల జరిపారు ఈమె ఏ రాష్ట్రానికి చెందినది ?
కేరళ
Q.సైలెంట్ వ్యాలీ అడవులను వరదలు ముంచెత్తుతున్న జలవిద్యుత్ ప్రాజెక్టును ఆపాలనే ప్రచారం - సేవ్ ది సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ ప్రాంతంలో జరిగింది ?.
కేరళ ,పాలక్కడ్
Q.ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) 10 శాతం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగంలో చేసిన సవరణ ఎన్నవది ?
103వ సవరణ
Q.డేవిడ్ హేర్ మరియు అలెగ్జాండర్ డఫ్ సహకారంతో, కింది వారిలో ఎవరు కలకత్తాలో హిందూ కళాశాలను స్థాపించారు ?.
రాజా రామ్మోహన్ రాయ్
Q.వీర గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల స్మారకార్థం నవంబర్ 15వ తేదీని ఏ దివస్ గా ప్రభుత్వం ప్రకటించింది ?.
Janjatiya Gaurav దివస్
Q.ఆదివాసీలకు "ఉల్గులన్" (తిరుగుబాటు, 1899-1900) కోసం పిలుపునిస్తూ గిరిజన ఉద్యమాన్ని నిర్వహించి, నడిపించాడు ఎవరు ?.
బిర్సా ముండా ఒక ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు,
Q.103వ రాజ్యాంగం (సవరణ) చట్టం, 2019 కింద 10% ఏ వర్గం కోటా 15 మరియు 16 ఆర్టికల్‌లను సవరించడం ద్వారా ప్రవేశపెట్టబడింది ?.
EWS కోటా,
Q. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రామ పంచాయితీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున గ్రామ పంచాయతీకి 20 ఏకకాల పనుల పరిమితిని తొలగించి ఎన్నింటికి పెంచింది ?.
50 పనుల కు పరిమితిని పెంచింది
Q.MGNREGS గ్రామీణ భారతదేశంలో కనీసం 100 రోజుల వేతన ఉపాధిని చట్టబద్ధంగా అందించడం ద్వారా " ఏ హక్కు"కి హామీ ఇస్తుంది ?.
" పని చేసే హక్కు"
Q.'డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్క్స్)', అనేది ఒక ? ?.
ప్రభుత్వేతర అంతర్జాతీయ సంస్థ
Q.ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB),ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడానికి 'ఏ అనే చొరవతో భారతదేశపు మొట్టమొదటి ఫ్లోటింగ్ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపును నిర్వహించింది ?.
'నివేశక్ దీదీ'
Q.ఉమియం సరస్సు ఏ రాష్ట్రము లో ఉంది ?
మేఘాలయ
Q.అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలును నడిపి ఏ దేశం రికార్డు సృష్టించింది ?
స్విట్జర్లాండ్: ఈ రైలులో 100 కోచ్‌లు ఉన్నాయి, 1910 మీటర్లు మరియు 4,550 సీట్లు ఉంటాయి.
Q. స్విట్జర్లాండ్ కరెన్సీ ? స్విట్జర్లాండ్ రాజధాని ?
కరెన్సీ ,స్విస్ ఫ్రాంక్ , రాజధాని ,బెర్న్..
Q.ఫిక్కీ అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక అయ్యారు ?
0 Comments