🦁జనరల్ నాలెజ్డ్ (జీకే), కరెంట్ అఫైర్స్.. దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో కీలకమైన విభాగాలు.యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఐబీపీఎస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోలీస్ నియామక పరీక్షలు, డీఎస్సీ ఇలా ఒకటేమిటి అన్ని నియామక పరీక్షల్లో జీకే, కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. కరెంట్ అఫైర్స్‌కు, జీకేకు ఎలాంటి సిలబస్ ఉండదు. ప్రశ్నలు ఏ విభాగం, ఏ మూల నుంచైనా రావచ్చు. వీటిల్లో అత్యధిక మార్కులు సాధించాలంటే
ఒకరోజులో లేదా ఒక నెలలో జరిగే పనికాదు ప్రతి రోజు అప్డేట్ అవుతూనే
ఉండాలి కనుక ఈ విభాగాల్లో మీకోసం ప్రశ్నలు అండ్ సమాధానాలు ఈ రోజుకి ...✊
🇰 🇨 🇰 🇪 🇩 🇺 |
❓ Q.గ్రీన్ వాషింగ్ ఏంటి ? ❓
🍄ప్రభుత్వాలు, కంపెనీల చర్యల వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయంలో వాస్తవాలను దాచి సానుకూల అభిప్రాయాలు కలిగించడం, తప్పుదారి పట్టించడాన్ని గ్రీన్ వాషింగ్ అంటారు.🍄
❓ Q. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) లో ఎన్ని సభ్యత్వ దేశాలు ఉన్నాయి ?❓
🍄193 సభ్య దేశాలు 🍄
❓Q.WMO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ❓
🍄జెనీవాలో ఉంది🍄
❓Q.WMO ద్వారా ప్రచురించబడిన ప్రధాన నివేదికలు ? ❓
🍄ప్రపంచ వాతావరణ స్థితి; గ్రీన్హౌస్ గ్యాస్ బులెటిన్.🍄
❓Q.UPI అనేది ఇంటర్-బ్యాంక్ లావాదేవీలను సులభతరం చేయడానికి దేని ద్వారా అభివృద్ధి చేయబడిన తక్షణ నిజ-సమయ చెల్లింపు వ్యవస్థ ? ❓
🍄నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా🍄
❓ Q.ఏనుగు గరిష్ట గర్భధారణ కాలం ఎన్ని రోజులు ఉంటుంది ?❓
🍄ఆఫ్రికన్ ఏనుగులకు 22 నెలల వరకు గర్భధారణ కాలం ఉంటుంది, అయితే ఆసియా ఏనుగులకు 18-22 నెలల గర్భధారణ కాలం ఉంటుంది🍄
❓Q.భారతదేశంలోని ఏ రాష్ట్రములో అత్యధిక ఏనుగు జనాభా కలిగి ఉంది ? ❓
🍄కర్ణాటకలో అత్యధిక సంఖ్యలో ఏనుగులు ఉన్నాయి, తర్వాత అస్సాం మరియు కేరళ ఉన్నాయి.🍄
❓ Q.లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ? ❓
🍄లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది నాన్-స్టేట్యుటరీ బాడీ మరియు ఇది భారత ప్రభుత్వం (ఎగ్జిక్యూటివ్ బాడీ) నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేయబడింది 🍄
❓ Q.లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖకు సలహా సంస్థగా వ్యవహరిస్తుంది. ?❓
🍄కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ🍄
❓ Q.రణతంబోర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది.? ❓
🍄రాజస్థాన్‌లో 🍄
❓ Q.రణతంబోర్ నేషనల్ పార్క్ ఏ కొండలలో ఉంది.?❓
🍄ఆరావళి మరియు వింధ్య కొండ శ్రేణుల జంక్షన్ వద్ద ఉంది🍄
❓ Q.భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన రాకెట్ పేరు ఏమి ?❓
🍄విక్రమ్-ఎస్🍄
❓ Q.విక్రమ్-ఎస్ ను ఎవరు అభివృద్ధి చేశారు ? ❓
🍄హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ దీనిని అభివృద్ధి చేసింది.🍄
❓ Q.ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPAce) ఎప్పుడు ఏర్పాటు చేశారు ? ❓
🍄IN-SPAce స్థాపన జూన్ 2020లో ప్రకటించబడింది. 🍄
❓Q.ఇటీవల జోధ్‌పూర్‌లో జరిగిన వైమానిక విన్యాసాలు ఎవరికీ సంబందించినవి ? ❓
🍄గరుడ-VII
ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) మరియు ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ (FASF) మధ్య ద్వైపాక్షిక వ్యాయామం.🍄
❓Q.కురింజిమల అభయారణ్యం ఎక్కడ వుంది ? ❓
🍄కేరళలోని ఇడుక్కి జిల్లాలో🍄
0 Comments